News June 11, 2024

ఈనెల 28వ తేదీ నుంచి ఓయూ ఎంబీఏ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT

Similar News

News September 22, 2024

HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

News September 22, 2024

HYD: ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్!

image

HYD శివారు ఫోర్త్ సిటీ ఏరియాలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2 రోజుల క్రితం అటవీశాఖ బృందం గుజరాత్ జామ్‌నగర్ ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అధ్యయనం చేసింది. ఫోర్త్ సీటీ చుట్టూర దాదాపు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో జూ పార్కుతో పాటు, 1000 ఎకరాల ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.

News September 22, 2024

28న నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.