News January 1, 2025
ఈనెల 3న చలో కలెక్టరేట్ల ముట్టడి: ఆర్ కృష్ణయ్య

విద్యార్థుల ఫీజుల బకాయిలను వెంటనే చేల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం బషీర్బాగ్లో ఈ ముట్టడికి సంబందించిన కరపత్రం ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి గత 2ఏళ్లు ఫీజుల బకాయిలు రూ. 4వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 18, 2025
శంకర్పల్లి: ప్రజలారా డబ్బులు వెనక్కివ్వలేదో… స్టేటస్ పెట్టేస్తా

శంకర్పల్లి మం.లోని ఓ గ్రామ సర్పంచి స్థానానికి పోటీచేసి ఓడిన అభ్యర్థి ఒకరు తనకు ఓటు వేయనివారు తానుపంచిన డబ్బును రిటన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే డబ్బులు తీసుకున్నవారి పేర్ల జాబితాను ఐదేళ్లపాటు రోజూ వాట్సప్ స్టేటస్ లో పెడతానని హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టారు. డబ్బులు వెనక్కి పంపినవారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ స్టేటస్కు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందంటూ ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు.
News December 18, 2025
RR: సొంత ఇలాఖాలో MLAల డీలా!

సొంత ఇలాఖాలో MLAలు డీలా పడ్డట్లు GP ఎలక్షన్స్ స్పష్టంచేస్తున్నాయి. షాద్నగర్ MLA నియోజకవర్గం సహా స్వగ్రామంలో ప్రభావం చూపలేకపోయారు. పలు మండలాల్లో BRS హవా నడిచింది. చేవెళ్లలో 16 గెలిచినప్పటికీ 10 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో గెలిచింది. రాజేంద్రనగర్ MLA ప్రకాశ్గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న శంషాబాద్లోనూ అతితక్కువ ఓట్లతోనే గెలిచింది. అలాగే ఫ్యూచర్ సిటీ పరిసర గ్రామాల్లోనే వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.
News December 18, 2025
రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఓటింగ్ జరగలే!

జిల్లాలో 3విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మాడ్గులలో 34 గ్రామాలుంటే 33 GPలకు మాత్రమే పోలింగ్ జరిగింది. నర్సంపల్లిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వ్యక్తి హనుమాన్ నాయక్ ఓటర్ల కార్డు ఉండి.. ఆయన వివరాలు గ్రామ ఓటర్ల లిస్టులో లేకపోవడం, అతడి, కుటుంబ ఓట్లు ఇతర గ్రామాల్లో ఉండటంతో ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తి అయ్యే వరకు ఎన్నికలు వద్దని హైకోర్టు ఆదేశించింది.


