News January 2, 2025
ఈనెల 3న పార్వతీపురం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
ఈనెల 3వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన డీవీఎంఎం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లావ్యాప్తంగా ఉన్న 15 మండలాల నుంచి ఎంపికైన దాదాపు 45 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరవుతారని తెలిపారు.
Similar News
News January 8, 2025
పార్వతీపురం: ‘వడ్డీలేని పంట రుణాలపై అవగాహన కల్పించాలి’
వచ్చే ఖరీఫ్ సీజన్కు రైతులకు లక్షలోపు వడ్డీ లేని పంట రుణాలు అందించనున్నందున పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంక్ అధికారులు, పలు శాఖల అధికారులతో డీసీసీ అండ్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు.
News January 6, 2025
విజయనగరం: రైల్వే కరెంట్ వైర్లు తగిలి వ్యక్తి మృతి
రైల్వే విద్యుత్ వైర్లు తగిలి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతి చెందినట్లు రైల్వే జీ ఆర్.పి ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఈ నెల రెండో తేదీన అలమండ రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ బండి ఎక్కి OHE విద్యుత్ వైర్లు తాకడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న బాధితుడు సోమవారం మరణించాడని ఆచూకీ తెలిస్తే సంప్రదించాలన్నారు.
News January 6, 2025
VZM: జాతీయ పోటీలకు 5 గురు జిల్లా క్రీడాకారులు
జనవరి 8 నుంచి 12 వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే 50 వ జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి 5 గురు క్రీడాకారులు ఎంపికయ్యారని కబడ్డీ సంఘం ఛైర్మన్ ఐవీపీ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాల, బాలికల విభాగంలో ఎం.రాంబాబు,సి హెచ్. మురళీ, పి.నందిని, వి.సూర్యకల, ఎం. పావని ఎంపికయ్యారన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీంకు ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.