News April 1, 2025
ఈనెల 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్: విశాఖ డిఈవో

జ్ఞానాపురంలోని సోఫియా జూనియర్ కళాశాలలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు డిఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 900 మంది ఉపాధ్యాయులు, అధికారులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.
Similar News
News October 28, 2025
అవసరమైతే బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలి: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. విశాఖలో 58 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేయాలన్నారు. మేఘాద్రి గడ్డ దిగువ ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయాలని కోరారు.
News October 27, 2025
ఏసీబీ వలలో జీవీఎంసీ ఆర్ఐ, సచివాలయ సెక్రటరీ

విశాఖలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా చిక్కారు. తగరపువలస దగ్గర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ సోమ నాయుడు, జీవీఎంసీ ఆర్ఐ రాజును సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచానికి సంబంధించిన కేసు విషయంలో ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 27, 2025
రుషికొండ బీచ్లో పరిస్థితులు పరిశీలించిన డీఐజీ

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ బీచ్ ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, అడిషనల్ ఎస్పీ మధుసూదన్ పరిశీలించారు. బీచ్ తీర ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. పర్యాటకులు, మత్స్యకారులను సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.


