News March 28, 2025

ఈనెల 30 నుంచి తలంబ్రాల బుకింగ్ ప్రారంభం

image

భద్రాచలంలో జరిగే శ్రీ రామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు బుకింగ్ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. భక్తులు దేవస్థాన అధికారిక వెబ్ సైట్ www.bhadradritemple. telangana.gov.in ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని ఆలయం ఈవో రమాదేవి తెలిపారు. ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు పంపిస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 9, 2025

MBNR: స్థానిక ఎన్నికలు.. పలు పరీక్షలు వాయిదా

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1,3,5 సెమిస్టర్ పరీక్షలను స్థానిక ఎన్నికల కారణంగా పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన పరీక్షలను 18 తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.

News December 9, 2025

పాకిస్థాన్‌కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

image

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్‌కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్‌ను తప్పించుకుంది.

News December 9, 2025

ముదిగొండ: కోతులు, కుక్కల బెడద నివారించేవారికే ఓటు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు. వారి ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.