News January 28, 2025
ఈనెల 31న ధర్మశ్రీ ప్రమాణ స్వీకారం

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈనెల 31న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు స్థానిక పట్టణ అధ్యక్షులు ఎం.జానకిరామ్ సోమవారం తెలిపారు. కసింకోట మండలం తేగాడలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మనసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
Similar News
News November 26, 2025
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అంబేడ్కర్ స్మృతి వనం: జడ శ్రవణ్

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని సందర్శించి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా స్మృతి వనం అధ్వానంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆయన మండిపడ్డారు. విగ్రహం ధ్వంసం అయ్యేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.స్మృతి వనం పరిరక్షణకు, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News November 26, 2025
ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.
News November 26, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

ఎనుమాముల మార్కెట్కి బుధవారం మిర్చి తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.17,000 ధర రాగా.. బుధవారం రూ.17,100 అయింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.19,500 ధర రాగా, ఈరోజు రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు తేజ మిర్చికి నిన్న రూ.14,600 ధర వస్తే.. నేడు రూ.15,100 అయింది.


