News February 4, 2025

ఈనెల 6న పీడీఎస్ బియ్యం వేలం..

image

జిల్లాలో నిల్వ ఉన్న 48.330 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్‌ను ఈనెల 6న బహిరంగ వేలం వేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. 6ఎ కేసుల్లో సీజ్ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని  ఉండి యం.యల్.యస్ పాయింట్‌లో నిల్వ ఉంచామన్నారు. విచారణ అనంతరం 6ఎ కేసులు ముగియడంతో సీజ్ చేసిన బియ్యాన్ని కేజీ రూ.20 ధర నిర్ణయించి వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనవచ్చన్నారు.

Similar News

News March 9, 2026

ఉమ్మడి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీలక్ష్మి

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా రిటైర్డ్ లెక్చరర్ చేకూరి ఝాన్సీలక్ష్మి నియమితులయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియామకం చేసినట్లు కార్యదర్శి G.V.S.D ప్రసాద్ తెలిపారు. DNR కాలేజీలో పనిచేసిన ఆమె సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఝాన్సీలక్ష్మికి అభినందనలు తెలుపుతూ సర్వోదయ ఆశయాల పట్ల ఆకాంక్షించారు.

News March 9, 2026

ప.గో: నేడు జిల్లాకు షర్మిల రెడ్డి

image

నేడు పశ్చిమగోదావరి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కాళ్ల మండలం సంత మార్కెట్లో ఉపాధి హామీ కూలీలతో చర్చిస్తారని, అనంతరం 3 గంటలకు భీమవరం ప్రకాశం చౌక్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారని జిల్లా అధ్యక్షుడు సీతారామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉపాధి హామీ కూలీలు పాల్గొంటారని అన్నారు.

News March 9, 2026

భీమవరం వన్‌టౌన్‌లో ‘పీజీఆర్‌ఎస్‌’: ఎస్పీ

image

భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలతో నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.