News May 4, 2024

ఈనెల 7న ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ రోడ్ షో

image

ఖమ్మం నగరంలో ఈనెల 7న సా. 5 గంటలకు సినీ హీరో విక్టరీ వెంకటేష్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విక్టరీ వెంకటేష్ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని జిల్లా నేతలు పేర్కొన్నారు. కాగా రఘురాం రెడ్డికి విక్టరీ వెంకటేష్‌కు వరుసకు వియ్యంకుడు.

Similar News

News December 16, 2025

ఖమ్మం: పంచాయతీ పోరులో ‘నోటు’ స్వామ్యం

image

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అభివృద్ధి హామీల కంటే డబ్బు, మద్యం, తాయిలాల పంపిణీకే ప్రాధాన్యం ఇవ్వడంతో పల్లె ఎన్నికలు ‘నోటుస్వామ్యం’లా మారాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.10 వేలు, మాంసం పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ రహిత ఎన్నికల్లో జిల్లా నాయకుల ప్రచారం చర్చనీయాంశమైంది.

News December 16, 2025

ఖమ్మంలో మూడో విడత పోరుకు సిద్ధం: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 191 గ్రామ పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇప్పటికే 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 పంచాయతీలకు 485 మంది సర్పంచ్‌లు పోటీలో ఉన్నారు. మొత్తం 2.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 318 క్రిటికల్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

News December 16, 2025

KMM: నాడు టీడీపీ నుంచి భర్త.. నేడు కాంగ్రెస్ నుంచి భార్య

image

నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మన్నె రాజశ్రీ గెలుపొందారు. పదేళ్ల క్రితం, 2013లో టీడీపీ తరఫున ఇదే పంచాయతీ సర్పంచ్‌గా ఆమె భర్త మన్నె నగేష్ విజయం సాధించారు. పార్టీ మారినా, పదేళ్ల తర్వాత మళ్లీ వారి కుటుంబం నుంచే సర్పంచ్‌గా రాజశ్రీ ఎన్నిక కావడం స్థానికంగా ఆసక్తిని పెంచింది.