News June 5, 2024
ఈనెల 7 నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభం
వరుస సెలవులు అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఈనెల 7 నుంచి పున:ప్రారంభమవుతుందని బుధవారం మార్కెట్ అధికారులు తెలిపారు. కావున ఈ విషయాన్ని రైతులందరూ గమనించి మార్కెట్లో క్రయవిక్రయాలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు.
Similar News
News December 11, 2024
‘ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి’
ఖమ్మం: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ పాస్ వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ అన్నారు. 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న వారికి న్యూ స్కీం క్రింద బాలురకు సం.కి రూ.1,000, బాలికలకు సం.కి రూ.1,500, రాజీవ్ విద్య దీవెన క్రింద 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు సం.కి రూ.3 వేలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
News December 10, 2024
ఆ సాగు ప్రోత్సాహానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?: ఎంపీ
ఖమ్మం: పామాయిల్ పంట సాగు ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న తెలంగాణ ప్రాంతంలో.. ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తుందా..? అని లిఖిత పూర్వకంగా అడిగారు.
News December 10, 2024
ఖమ్మం: మాస్ కాపీయింగ్.. 22 మంది విద్యార్థులు డిబార్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.