News March 4, 2025
ఈనెల 8న మార్కాపురం రానున్న చంద్రబాబు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఈనెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టరేట్కి అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం పూర్తి వివరాలు అందనున్నాయి. అయితే గత సంవత్సరం కూడా ఈ వేడుకలను చంద్రబాబు మార్కాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. దరిమడుగు లేదా ఎస్వీకేపి కళాశాలలో కానీ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది.
Similar News
News December 15, 2025
అమర జీవికి సెల్యూట్ చేసిన ప్రకాశం SP.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌరవ వందనంగా SP సెల్యూట్ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకోసం ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా అమరజీవి ఆమరణ నిరాహార దీక్షతో ఆత్మార్పణ చేసి అమరులయ్యారన్నారు.
News December 15, 2025
ఒంగోలు మేయర్ అంటే.. లెక్కలేదా: సుజాత

ఒంగోలు మేయర్ గంగాడ సుజాతకు కోపమొచ్చింది. నేడు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు సైతం హాజరవుతున్నారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకంపై మేయర్ సుజాత పేరు లేకపోవడం, అలాగే ఆహ్వాన పత్రికలో సైతం ఆమె పేరు లేకపోవడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
News December 15, 2025
జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.


