News March 4, 2025
ఈనెల 8న మార్కాపురం రానున్న చంద్రబాబు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఈనెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టరేట్‌కి అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం పూర్తి వివరాలు అందనున్నాయి. అయితే గత సంవత్సరం కూడా ఈ వేడుకలను చంద్రబాబు మార్కాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. దరిమడుగు లేదా ఎస్వీకేపి కళాశాలలో కానీ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది.
Similar News
News March 24, 2025
ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.
News March 24, 2025
ప్రకాశం: నేటి నుంచి ఇన్విజిలేటర్ల మార్పు

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను మారుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 146 పరీక్ష కేంద్రాల్లో గణితం పరీక్ష నుంచి 1,300 మందిని జంబ్లింగ్ రూపంలో మార్చారు. గణితం పీఎస్, ఎన్ఎస్, సోషల్ స్టడీస్ పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో మార్చామని, వారు ఆయా కేంద్రాలలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
News March 24, 2025
ప్రకాశం: EKYC ఎక్కడ చేస్తారంటే..?

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో 6.61లక్షల రేషన్ కార్డుల ఉండగా.. లబ్ధిదారుల సంఖ్య 19.37లక్షలుగా ఉంది. ఇందులో 17.31లక్షల మందే EKYC చేయించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్ల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.