News June 5, 2024

ఈనెల 9వ తేదీ వరకు మాచవరంలో 144 సెక్షన్ 

image

మాచవరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మాచవరం ఎస్సై అమిరుద్దీన్ బుధవారం తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని పిన్నెల్లి, కొత్త గణేషన్‌పాడు గ్రామాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు.

Similar News

News September 16, 2025

అమరావతిలో ఆధునిక మురుగునీటి వ్యవస్థ

image

అమరావతిలో 934 కి.మీ పైపుల ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మిస్తోంది. 13 STPలు రోజుకు మొత్తం 330.57 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయని CRDA పేర్కొంది. ఇవి ఫ్లషింగ్, శీతలీకరణ & నీటిపారుదల కోసం నీటిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తాయి! నగరాన్ని పచ్చగా, స్థిరంగా మార్చడానికి ఒక సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను కూడా ప్లాన్ చేస్తున్నారు.

News September 16, 2025

ANU: ఏపీ ఎడ్ సెట్-2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు

image

ఏపీ ఎడ్‌సెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ స్వామి తెలిపారు. వెబ్ ఆప్షన్స్ గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించామన్నారు. కళాశాల మార్పునకు 18వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ 20వ తేదీన జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.

News September 15, 2025

ANU: ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

image

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ పీజీ సెట్ – 2025 షెడ్యూల్‌లో మార్పులు జరిగాయని కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 17 వరకు, ఆన్‌లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణను 18 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 20 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.