News January 30, 2025

ఈపూరు: తండ్రిని కాలువలోకి నెట్టి వేసిన కుమారుడు

image

ఈపూరు మండలంలోని బద్రుపాలెం వద్ద సాగర్ కుడి కాల్వలో కన్న తండ్రిని కుమారుడు నెట్టి వేసినట్లు స్థానికులు సమాచారం. అది గమనించి కాలువలో పడిన వ్యక్తిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే కాలువలో పడ్డ వృద్ధుడిని బయటకు తీసే సరికి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

Similar News

News September 18, 2025

అనకాపల్లి: గ్యాస్ సబ్సిడీ నగదు జమ కాని వారికి గమనిక

image

గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమకాని లబ్ధిదారులు నేరుగా బ్యాంకు వద్దకు వెళ్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దీపం -2 పథకంలో భాగంగా సబ్సిడీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 805 మంది లబ్ధిదారులకు నగదు జమకాలేదని వారికి డీలర్లు తగిన సమాచారం ఇవ్వాలన్నారు.

News September 18, 2025

ఏలూరు: రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు

image

ఏలూరు జిల్లాలో ఏడుగురు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు బదిలీ ఉత్తర్వులను డీఆర్‌ఓ విశ్వేశ్వరయ్య జారీ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఈ బదిలీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

News September 18, 2025

నిర్మల్: ‘మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’

image

మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య అన్నారు. గురువారం పట్టణంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మేదరులను ఆదుకునేందుకు మేదరి బంధు, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే అందించాలని, జనాభా ప్రాతిపదికన ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు.