News May 18, 2024
ఈపూరు వద్ద పిడుగుపాటు.. రైతు మృతి

ఈపూరు మండలం అరేపల్లి ముప్పాళ్లలో పిడుగుపాటుకు గురై కర్రి హనుమంతరావు (40) అనే రైతు మృతి చెందాడు. హనుమంతరావు శనివారం గేదెలను మేపేందుకు వెళ్ళినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుండగా గ్రామ సమీపంలోని నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే పిడుగుపడి హనుమంతరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.
Similar News
News November 7, 2025
దుగ్గిరాలలో యువకుడి దారుణ హత్య

దుగ్గిరాలలోని వంతెన డౌన్లో రజకపాలెంకు చెందిన వీరయ్య (37) దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News November 7, 2025
GNT: సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్

సీఎం చంద్రబాబును గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడికొండ మండలం లాం గ్రామంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించి స్వాగతం పలికారు.
News November 7, 2025
తుఫాన్ సెలవులు భర్తీ.. రెండవ శనివారం కూడా స్కూల్లు

తుఫాను కారణంగా గత నెలలో ఇచ్చిన 4 రోజుల సెలవులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఫిబ్రవరి నెల వరకు 2వ శనివారం సెలవులను రద్దు చేస్తూ డీఈవో సివి రేణుక ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి 2వ శనివారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ రెండో శనివారం వరకు 4 రోజులు అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా నడపాలని డీఈఓ ఆదేశించారు. దీంతో 4 నెలల పాటు స్కూల్లకు 2వ శనివారం సెలవులు రద్దయ్యాయి.


