News May 18, 2024

ఈపూరు వద్ద పిడుగుపాటు.. రైతు మృతి

image

ఈపూరు మండలం అరేపల్లి ముప్పాళ్లలో పిడుగుపాటుకు గురై కర్రి హనుమంతరావు (40) అనే రైతు మృతి చెందాడు. హనుమంతరావు శనివారం గేదెలను మేపేందుకు వెళ్ళినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుండగా గ్రామ సమీపంలోని నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే పిడుగుపడి హనుమంతరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

Similar News

News December 3, 2024

గుంటూరు: హంతకుడు.. గ్యాస్ డెలివరి బాయ్

image

చేబ్రోలులోని హత్య కేసును పోలీసులు ఛేదించారు. SP వివరాలు.. ఇబ్రహీంపట్నం(M) కొండపల్లికి చెందిన నాగరాజు కొత్తరెడ్డిపాలెంలో అద్దెకు ఉంటూ ఓ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ, మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఆమె మరొకరితో సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై ఆమె కూతురిని అడిగాడు. బాలిక చెప్పకపోవడంతో తండ్రిలాగా చూసుకుంటున్న తనకు చెప్పలేదని నాగరాజు జులై 15న హత్య చేసి, పరారయ్యాడు. నిన్న లొంగిపోయాడు.

News December 2, 2024

ఈనెల 7న గుంటూరులో ఫ్లాగ్ డే: కలెక్టర్ 

image

ఈనెల 7వ తేదీన గుంటూరులో ఫ్లాగ్‌డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మీ చెప్పారు. ఈ సందర్భంగా సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా రూపొందించిన స్టిక్కర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ విరాళాలు దేశ భద్రత కోసం అసువులు బాసిన వీర జవానుల కుటుంబ సభ్యులకు ఎంతో కొంత తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 

News December 2, 2024

అమరావతి: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సమీక్ష

image

పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సిఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు.