News February 26, 2026

ఈరోజు నమాజ్ వేళలు (26-02-2026, గురువారం)

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.34 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 3.55 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.24 గంటలకు
♦︎ ఇష: రాత్రి 8.24 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News April 18, 2026

రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

image

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్‌లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.

News April 18, 2026

లోక్‌సభ నిరవధిక వాయిదా

image

లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

News April 18, 2026

చర్చకు సిద్ధమా? పవన్‌కు ప్రకాశ్‌రాజ్ సవాల్

image

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని AP D.CM <<19679100>>పవన్<<>> చేసిన ట్వీట్‌పై ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ‘మోదీని మెప్పించేందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపండి. ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పుడూ ఆమోదించవచ్చు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది. దీనిపై డిబేట్‌కు సిద్ధమా’ అని సవాల్ విసిరారు.