News March 24, 2024

ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా శనివారం గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో, భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిరంగిపురంలో వీవీ ప్యాట్‌లను కూడా పరిశీలించారు.

Similar News

News November 14, 2024

బాధితులల్లో మన గుంటూరుకే మొదటి స్థానం

image

రాష్ట్రవ్యాప్తంగా 2022లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) ప్రజల ఆరోగ్యంపై కోసం ఇళ్ల వద్దకే వెళ్లి బీపీ, షుగర్, బీఎంఐ.. సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 74.48 శాతం మందికి పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా జిల్లాలో 65,772 మంది షుగర్ బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో షుగర్ బాధితులలో గుంటూరు మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా పెరిగింది. 

News November 14, 2024

సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

image

గుంటూరు కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. నాగలక్ష్మీ ఐఏఎస్. గురువారం పెదకాకానిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి, పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ఆమె దృష్టి సారించారు.

News November 14, 2024

పెదకాకాని: దారుణం.. బాలికపై చిన్నాన్న అఘాయిత్యం.!

image

పెదకాకాని మండలంలోని ఓ గ్రామంలో తండ్రి లేని ఓ మైనర్ బాలిక ఇంటి దగ్గరే ఉంటోంది. అదే గ్రామంలో నివసిస్తున్న చిన్నాన్న మొగులూరి శామ్యూల్ ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకొని 8 నెలలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలికకు నెలసరి రాకపోవడంతో తల్లి డాక్టర్‌కు చూపించగా 3వ నెల గర్భిణిగా నిర్ధారించారు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.