News August 16, 2024
ఈవీఎంలపై మాజీ ఉప ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈవీఎంలపై మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సాలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని మెజారిటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, 2019లో చంద్రబాబు కూడా ఈవీఎంలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఈ సారి ఫలితాలు మరింత బలాన్ని చేకూర్చాయని, బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలన్నారు.
Similar News
News September 19, 2024
నెల్లూరు జిల్లాలో పార్వతీపురం వాసి సూసైడ్
నెల్లూరు జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా వాసి సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లకూరు మండలం రాజుపాలెం అటవీ ప్రాంతంలో చంద్రశేఖర్ వేప చెట్టుకు ఉరేసుకుని ఉండడాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు వివరాలు ప్రకారం.. చంద్రశేఖర్ మెగా కంపెనీలో పని చేస్తూ పెళ్లకూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. భార్యతో వివాదాల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
News September 19, 2024
గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్
మహాకవి గురజాడ వెంకట అప్పారావు 162వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో గురజాడ జయంతి ఉత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గురజాడ గృహం వద్ద ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన విగ్రహానికి పూల మాలాలంకరణ చేస్తామన్నారు.
News September 19, 2024
మంత్రి లోకేశ్‌తో జిల్లా ప్రజా ప్రతినిధులు భేటీ
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ సమావేశంలో మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, అదితి గజపతి, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్సీ చిరంజీవి, తదితరులు నారా లోకేష్ తో భేటీ అయ్యి కాసేపు మాట్లాడారు. నియోజకవర్గాల తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు.