News May 12, 2024

ఈవీఎంలు తరలించే బస్సులకు GPS: గుంటూరు కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో ఈనెల 13వ తేదీ జరుగుతున్న పోలింగ్‌కు జిల్లాలో 1498 పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ తన కార్యాలయంలో ఎస్పీ తుషార్‌తో కలిసి మాట్లాడారు. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి బస్సుకు జిపిఎస్ ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారాలు, ర్యాలీలు చేయకూడదన్నారు.

Similar News

News February 18, 2025

దరఖాస్తులను 20 నాటికి అందించాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారులు నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను ఈనెల 20 నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరే విధంగా అందించాలన్నారు.

News February 17, 2025

విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్ 

image

10వ తరగతి పరీక్షల విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం, కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. 

News February 17, 2025

గుంటూరు: రూ.11లక్షల విలువ గల బైక్‌లు స్వాధీనం

image

పట్టాభిపురం, చేబ్రోలు, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులకు సంభందించి రూ. 11లక్షల విలువ గల ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. 2.24 లక్షల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. వాటిని ఎస్పీ సతీశ్ కుమార్ మీడియా ముందు ఉంచారు. పార్కింగ్ చేసిన వాహనాలను నకిలీ తాళంతో తీసి దొంగతనం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 

error: Content is protected !!