News August 10, 2024

ఈవీఎంల చెకింగ్.. ఒంగోలులోనే ఎందుకు.?

image

ఒంగోలులో ఈ నెల 19 నుంచి 24వరకు ఈవీఎంల పరిశీలన జరగనుంది. దీనికి కారణం ఏంటంటే.. ఇటీవల ఎన్నికల్లో అవకతకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. ఈవీఎంల పరిశీలనకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బెల్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేసిన వారికి డమ్మీ బ్యాలెట్‌లు ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియ చూపించనున్నారు. 12పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను పరిశీలించనున్నారు.

Similar News

News November 27, 2024

ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు

image

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని తాలుకా పోలీస్ స్టేషన్‌లోనే ఆయనను రాత్రి నుంచి ఉంచారు. అక్కడే వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు ఉండటంతో మరికాసేపట్లో అక్కడికి తరలిస్తారని సమాచారం.

News November 26, 2024

అద్దంకి: 108 ఉద్యోగుల సమ్మె తాత్కాలిక వాయిదా

image

108 ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా పోస్ట్ పోన్ అయినట్లు 108 బాపట్ల జిల్లా కార్యదర్శి, అద్దంకి 108 EMT హరిబాబు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. 108 సమస్యలపై 108 ప్రిన్సిపల్ సీఈవో 14 డిమాండ్లపై మినిట్స్ రూపంలో హామీ ఇచ్చినట్లు. ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు.

News November 26, 2024

టంగుటూరులో హత్య

image

టంగుటూరులో ఓ వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. వేరు గ్రామంలో ఉన్న భర్త తన భార్య హైమావతికి పలుమార్లు ఫోన్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వాళ్లకు ఫోన్ చేశాడు. వారు ఇంటికి తాళం ఉందని అతడికి చెప్పారు. వెంటనే బంధువులను విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఇంటి తాళాలు పగలకొట్టారు. తీరా చూస్తే హైమావతి కత్తిపోటుకు గురై ఉందని తెలిపారు.