News March 27, 2025
ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోడౌన్ను పరిశీలించాలి. కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
ప్రకాశం జిల్లా గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు.!

ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ జయ పార్ట్టైం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. చీమకుర్తి బాలికల గురుకులాల్లో JL బోటనీ, మార్కాపురం బాలికల గురుకులాల్లో JL మ్యాథమెటిక్స్, కొండేపిలో TGT ఫిజికల్ సైన్స్ విభాగాలకు దరఖాస్తులు అందుకుంటున్నారు. డిసెంబర్ ఒకటిలోగా చీమకుర్తి గురుకులంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. 2వతేదీ 11 AMకి చీమకుర్తి గురుకులంలో డెమో క్లాస్ ఉంటుందన్నారు.
News November 25, 2025
ప్రకాశం SP మీకోసంకు 63 ఫిర్యాదులు.!

ఒంగోలు SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన SP మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వర ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ DSP రమణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు.
News November 24, 2025
ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.


