News November 28, 2024

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ: కలెక్టర్ వెట్రిసెల్వి

image

ఏలూరు కలెక్టరేట్‌లో ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్‌లు భద్రపరిచే గోడౌన్‌ను గురువారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. గోదాం తాళాలు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపకదళ పరికరాలను పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్‌ను పరిశీలించి సంతకం చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News December 2, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో 31,185 మంది HIV రోగులు

image

రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా ప.గో. జిల్లాలో 15,612 ఏలూరు జిల్లాలో 15,573 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక AP ART సెంటర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.24లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వారికి ప్రతి నెల రూ.4వేలు పింఛను అందిస్తోంది. గడిచిన ఆరు నెలల్లో 8,400 మంది కొత్త HIV కేసులు గుర్తించారు.

News December 2, 2024

ఏలూరులో వివాహిత ఆత్మహత్య.. భర్తతో గొడవలే కారణం?

image

ఏలూరులో వివాహిత ప్రియాంక(25) <<14761231>>ఆత్మహత్యకు<<>> భర్తతో గొడవలే కారణమని తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పని చేసే శ్రీకాంత్(30) అనే వ్యక్తి తనకు గతంలో పెళ్లయిందనే విషయాన్ని దాచి ప్రియాంకను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవల ప్రియాంకకు తెలిసి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. డబ్బు కోసం వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సైతం తెలిపింది. శనివారం రాత్రి కూడా గొడవ జరగ్గా నిన్న ఆమె ఉరి వేసుకుంది.

News December 2, 2024

అర్జీదారులకు గమనిక: ఏలూరు కలెక్టర్

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను సోమవారం నుంచి మండల, డివిజనల్ ,మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు.