News May 12, 2024

ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆదివారం మణుగూరులో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఎవరూ కూడా పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమికూడరాదని తెలిపారు.

Similar News

News February 9, 2025

అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి సూసైడ్

image

అమెరికా న్యూయార్క్‌లో ఖమ్మం జిల్లా యువకుడు తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నారు. చదువుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సాయి కుమార్ ఆఫీసులోనే పాస్ పోర్టు వదిలేసినట్లు సమాచారం. అకాల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 9, 2025

నిర్మలా సీతారామన్‌ను కలిసిన Dy.CM భట్టి

image

దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. ఆయన వెంట ఎంపీలు మల్లు రవి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.

News February 8, 2025

భద్రాద్రి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

ములకలపల్లి మండలం సుబ్బనపల్లి, బండివారి గుంపులో కరెంట్ షాక్‌తో బండి వెంకటమ్మ(57) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. వెంకటమ్మ తన నివాసంలో ఉండగా, మంచం మీద కరెంట్ వైర్ పడటంతో ఈ విషాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఇంటి నుంచి కాలిన వాసన రావడంతో సమీప ప్రజలు వెళ్లి చూడగా, అప్పటికే మృతి చెందారని తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!