News March 16, 2025
ఈవీఎం మిషన్లు తనిఖీలు చేసిన వరంగల్ కలెక్టర్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా వేర్ హౌస్ గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ సత్య శారదా దేవి వివిధ పార్టీ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి తనిఖీలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 17, 2025
WGL: మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పలు సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు రూ. 26 వేలు పలకగా.. దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,500 పలికింది. అలాగే 5531 మిర్చికి కూడా నేడు రూ.9,300 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి ఉన్న డిమాండ్‌ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.
News April 17, 2025
నర్సంపేట: వ్యభిచార గృహంపై దాడులు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గురువారం పక్కా సమాచారం మేరకు ఒకరి ఇంట్లో దాడులు చేయగా.. పట్టణానికి చెందిన ఓ మహిళ, బాంజిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.
News April 17, 2025
WGL: మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,500 పలికింది. అలాగే పసుపు(కాడి) క్వింటాకి ధర రూ.14,117 వచ్చింది. మరోవైపు మక్కలు(బిల్టీ) క్వింటా ధర రూ.2,365 పలికినట్లు అధికారులు వెల్లడించారు.