News May 3, 2024
ఈవీఎం స్ట్రాంగ్ రూమును పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
నందిగామ పట్టణ పరిధిలోని కెవిఆర్ కళాశాలలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎన్నికల పరిశీలకులు నరేంద్ర సింగ్ బాలి గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతంలో పోలింగ్ జరిగే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పలు పోలింగ్ కేంద్రాలలోని మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో RDO తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 11, 2024
విజయవాడ: జనసేనలో చేరిన YCP కార్పొరేటర్లు
విజయవాడకు చెందిన నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సోమవారం జనసేన పార్టీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, ఉమ్మడిశెట్టి బహుదూర్, ఆదిలక్ష్మి, రాజేశ్‌లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పవన్ సూచించారు.
News November 11, 2024
అగిరిపల్లి: 13న జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక
ఆగిరిపల్లిలోని ఆంధ్ర న్యూ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ అకాడమీలో నవంబర్ 13న జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సోమవారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాస్, ఎమ్. శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14 బాల,బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరు కావాలన్నారు.
News November 11, 2024
యూటీఎఫ్ కృష్ణా జిల్లా కార్యదర్శుల ఎన్నిక
గన్నవరం సీఎల్ రాయుడు ఆడిటోరియంలో సోమవారం జరిగిన యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలో కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట జడ్పీ హైస్కూలు ఉపాధ్యాయులు లంకా నరేంద్ర, గుడ్లవల్లేరు ఎంపిపి స్కూల్ – 2 ఉపాధ్యాయిని వరలక్ష్మి జిల్లా కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు.