News October 28, 2024

ఈసారైనా బాలినేని వస్తారా? రారా?

image

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేనిది కీలక పాత్ర. ఇటీవల ఈయన వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినా ఆయన ఎక్కడా కానరాలేదు. ఈనెల 30న జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఒంగోలులో కూటమి నాయకులతో కీలకమైన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికైన బాలినేని వస్తారా? రారా? అనేది ఆసక్తిగా మారింది. మరి మీరేమంటారు కామెంట్ చేయండి.

Similar News

News November 21, 2025

ఇద్దరు హోంగార్డుల మధ్య గొడవ.. సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రకాశం ఎస్పీ!

image

క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దారవీడుకు చెందిన హోంగార్డ్ యాసిన్, దోర్నాలకు చెందిన ప్రశాంత్ కుమార్, వెలిగండ్లకు చెందిన బాలసుబ్రమణ్యం విధుల నిమిత్తం 19న ఒంగోలుకు వచ్చి విశ్రాంతి కోసం గదిని తీసుకున్నారు. ప్రశాంత్, సుబ్రహ్మణ్యం గొడవ పడగా, ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

News November 21, 2025

కురిచేడు: విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన

image

కురిచేడు మండలం కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. 4, 5 తరగతులకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

News November 21, 2025

కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్‌మెన్‌గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.