News May 5, 2024

ఈసీ నిర్ణయంపై చిత్తూరులో ఉత్కంఠ

image

ఇప్పటికే పుంగనూరు, పలమనేరును అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. తాజాగా పీలేరు, తంబళ్లపల్లె, చంద్రగిరి, తిరుపతిని ఆ జాబితాలోకి చేర్చింది. ఇక్కడా వెబ్ కాస్టింగ్‌తో పాటు భారీగా బలగాలను మోహరించనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉండగా.. దాదాపు సగం ప్రాంతాలపై ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది.

Similar News

News September 30, 2024

SVU : ఫీజు చెల్లించడానికి నేడు చివరి తేదీ

image

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.

News September 30, 2024

సబ్ కలెక్టర్ రేట్ ఫైళ్ల దగ్ధం కేసులో రికార్డులు తీసుకెళ్లిన సిఐడి

image

మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్ లో ఫైళ్ల దగ్ధం అనంతరం సీజ్ చేసిన రికార్థులను ఆదివారం ప్రత్యేకవాహనంలో తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. శనివారం మదనపల్లెకు వచ్చిన సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ రెండు రోజులపాటు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో కేసులోని కొందరిని విచారించారు. అనంతరం అప్పట్లో కేసుకు సంబంధించి సీజ్ చేసిన రికార్డులు అన్నింటినీ స్వాధీనంచేసుకుని తీసుకెళ్లడంతో ఫైల్ దగ్ధం కేసు మరుగున పడిందనట్లయింది.

News September 30, 2024

మదనపల్లెలో టమాటా కిలో రూ. 60

image

మదనపల్లెలో టమాటా KG రూ.60 పలికింది. దిగుబడి తక్కువగా ఉండటంతో వ్యవసాయ మార్కెట్లో ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా కిలో ధర రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. 25 కిలోల క్రేట్ ధర రూ.1,500వరకు పలికిందని అధికారులు పేర్కొన్నారు. బయటరాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలేకపోవడంతో ఇక్కడి టమాటాకు డిమాండ్ పెరిగింది. వారంరోజులుగా కిలో రూ.44నుంచి రూ.50 వరకు పలకగా ఆదివారం రూ.60 చేరింది.