News August 12, 2024
ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖాతాలో మరో మైలురాయి
ఈస్ట్ కోస్ట్ రైల్వే మరో మైలు రాయిని సాధించింది. ప్రజలతో కూడిన మల్టీ మోడల్ లార్జెస్ట్ పార్ట్ అండ్ కంటైనర్‌ను విశాఖ నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ సెంట్రల్ రైల్వేలో విజయవంతంగా లోడ్ చేసింది. పవర్ వ్యాగన్ లతో కూడిన 1,080 టన్నుల రొయ్యలు ఈ కంటైనర్‌లో ఉన్నాయి. ఈ సందర్భంగా సౌరవ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సరుకు రవాణా ద్వారా రైల్వే మరింత ఆదాయ మార్గాలను సమకూర్చుకుంటోందని అన్నారు.
Similar News
News September 11, 2024
విశాఖ: ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష
విశాఖ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా లబ్ధిదారులను తీసుకెళ్లి జియో ట్యాగింగ్ చేయించాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అన్ని విధాల సహకారం అందించాలన్నారు.
News September 10, 2024
విశాఖ: ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12న జాబ్ మేళా
విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ చేసినవారు అర్హులు. అశోక్ లేలాండ్ కంపెనీలో ఖాళీలు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సెలక్ట్ అయిన వారికి దుబాయ్‌లో ఉద్యోగావకాశం అని పేర్కొన్నారు. వివరాలకు 9440197068 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
News September 10, 2024
ఈనెల 17 వరకు సింహాచలంలో వార్షిక పవిత్రోత్సవాలు
సింహాచలం ఆలయంలో ఈనెల 13 నుంచి 17 వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, వేద పారాయణం, తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ఈనెల 13 నుంచి ఆర్జిత సేవలతో పాటు నిత్య కళ్యాణ ఉత్సవాలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల తర్వాత స్వామి దర్శనాలు లభించవన్నారు.