News January 29, 2025

ఈ అందమైన ఊరు పేరు తెలుసా?

image

కోనసీమ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొబ్బరి తోటలే దర్శనమిస్తాయి. వాటి మధ్య చిన్న కాలువలు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. వర్షాకాలంలో అన్ని కాలువలకు నీరు వచ్చినప్పడు కోనసీమ మరింత రమణీయంగా మారుతుంది. ఇలాంటి అందాలతో కూడకున్నదే పైన ఉన్న ఫొటో. మన కోనసీమలో ఈ ఏరియా ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.

Similar News

News October 29, 2025

కల్లెడలో 367 మి.మీ నమోదు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి 7 గంటల వరకు పలు మండలాల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. పర్వతగిరి మండలం కల్లెడలో అత్యధికంగా 367 మి.మీ వర్షపాతం నమోదైంది. నెక్కొండలో 316 మి.మీ, భీమదేవరపల్లిలో 292.5 మి.మీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

News October 29, 2025

VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

image

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News October 29, 2025

సుబేదారి: లోతట్టు ప్రాంతాల్లో పోలీసుల రక్షణ చర్యలు

image

సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. రాంనగర్ ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. అకస్మాత్తుగా పెరిగిన వరద నీటిలో స్థానికులు చిక్కుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసు సిబ్బంది తక్షణమే స్పందించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకుండా రక్షణ చర్యలు సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.