News November 8, 2024

‘ఈ అమ్మవారిని కదంబ పుష్పాలతో పూజిస్తారు’

image

మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలోని భ్రమరాంబికా అమ్మవారిని భక్తులు ప్రతి శుక్రవారం కదంబ పుష్పాలు, ఆకులతో పూజిస్తారు. ఈ ఆలయంలో శ్రావణ, కార్తిక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని, కొత్త వాహనాలకు పూజలు చేయిస్తే వాటికి ఆపద రాదని భక్తులు చెబుతున్నారు. చిన్న పిల్లలను ఆలయంలోని ఉయ్యాలలో వేస్తే సుఖంగా ఉంటారని ఇక్కడి ప్రజల నమ్మకం. ప్రతి శుక్రవారం ఇక్కడ భక్తులకు అన్న సంతర్పణ చేస్తారు.

Similar News

News December 11, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB) – హౌరా(HWH)(నం.06585) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 10.15 గంటలకు SMVBలో బయలుదేరే ఈ ట్రైన్ అదే రోజు రాత్రి 10.10 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 15వ తేదీన రాత్రి 9.45 గంటలకు HWH చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.

News December 11, 2024

కృష్ణా: పీజీ (రెగ్యులర్ )పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పీజీ కోర్సు 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

News December 11, 2024

విజయవాడ: వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డికి షాక్

image

తనపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత పూనురు గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి హత్యకు గౌతమ్ రెడ్డి కుట్ర పన్నారని, ఘటనకు సంబంధించిన CC ఫుటేజ్, ఫోటోలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ కేసు వాదనలో భాగంగా గతంలోనే న్యాయస్థానానికి విన్నవించారు.