News November 11, 2024
ఈ ఏడాది విశాఖలో నేవీ డే వేడుకలు లేనట్లే
ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన విశాఖలో బీచ్ రోడ్డులో నేవీ డే వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం విశాఖలో కాకుండా ఒడిశాలో గల బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో నిర్వహించనున్నట్లు ఈస్ట్రన్ నావల్ కమాండ్ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌ను డీడీ నేషనల్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.
Similar News
News December 11, 2024
విశాఖ: పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు
వచ్చేనెల 2 నుంచి 8 వరకు విశాఖ- రాయపూర్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, 3 నుంచి 9 వరకు రాయపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు వాల్తేర్ డీసీఎం కే.సందీప్ బుధవారం పేర్కొన్నారు. 3 నుంచి 8 వరకు విశాఖ-భవానిపట్నం స్పెషల్ పాసింజర్, విశాఖ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్, 4 నుంచి 9 వరకు భవానిపట్నం- విశాఖ ప్యాసింజర్, 3 నుంచి 8 వరకు దుర్గ్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు తెలిపారు.
News December 11, 2024
సీఎంతో సమావేశంలో అనకాపల్లి, విశాఖ కలెక్టర్లు
వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెండు రోజుల పాటు జరుగుతున్న కలెక్టర్లు సమావేశంలో విశాఖ, అనకాపల్లి కలెక్టర్లు ఎం.ఎన్ హరిందర్ ప్రసాద్, విజయ కృష్ణన్ పాల్గొన్నారు. రెండు రోజుల సమావేశంలో భాగంగా కలెక్టర్లకు స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న పలు పథకాల అమలపై కూడా చర్చించనున్నారు.
News December 11, 2024
గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.