News May 3, 2024

ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి: ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్

image

ఏలూరు జిల్లాలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 9మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.ఎస్.కుమరేశ్వరన్ గురువారం తెలిపారు. వారి నుంచి 207 మద్యం బాటిల్స్, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడైనా అక్రమంగా మద్యం, తదితరాలపై ఫిర్యాదులుంటే 08812-355350 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాని సూచించారు. SHARE IT

Similar News

News November 23, 2025

ఉండి: ఆవాస్ సర్వే పరిశీలనలో కలెక్టర్

image

ఉండి రాజులపేటలో జరుగుతున్న ‘ఆవాస్’ సర్వేను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గృహ నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం గృహ నిర్మాణ శాఖ చేపడుతున్న ఈ సర్వే తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. యాప్ పనితీరు, ఆన్‌లైన్ ప్రక్రియపై వివరాలు అడిగారు. కముజు సూర్యకుమారి అనే లబ్ధిదారుని వివరాలను యాప్ ద్వారా ఆన్‌లైన్ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు.

News November 23, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 23, 2025

భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

image

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.