News August 4, 2024
ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు:మంత్రి

ఖమ్మం: ఈ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. రైతులను రాజులు చేయాలని, రైతు ముఖంలో ఆనందం చూడాలని నెల రోజులలోపే రూ. 31 వేల కోట్లు రైతు పంట రుణమాఫీ చేశామన్నారు. ధరణి తో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.
Similar News
News January 5, 2026
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై జిల్లా అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సత్తుపల్లి, వైరా, ఖమ్మం అర్బన్ ప్రాంతాల నుంచి భూ వివాదాలు, పర్యావరణం, మున్సిపల్ సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వీటిని ఆయా విభాగాలకు బదిలీ చేస్తూ.. నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 5, 2026
ఖమ్మం ఐటీ హబ్‌లో ఉచిత శిక్షణ

ఖమ్మం ఐటీ హబ్‌లో నిరుద్యోగ యువతకు వివిధ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు. జావా, పైథాన్, ఒరాకిల్ ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, బూట్‌స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో నైపుణ్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 13వ తేదీ లోపు ఐటీ హబ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
News January 5, 2026
KMM: అవినీతి రహిత సేవలే లక్ష్యం: మంత్రి పొంగులేటి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 దశల్లో 94 కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా మరో 10 సమీకృత భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ సంస్కరణల వల్ల అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు.


