News February 6, 2025
ఈ నెల 10న కొడంగల్లో BRS రైతు దీక్ష

సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఈ నెల 10న బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. కోస్గిలో జరిగే ఈ దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష నిర్వహించనుంది.
Similar News
News November 19, 2025
MBNR: పవిత్ర పుణ్య క్షేత్రాలకు డీలక్స్ బస్

మహబూబ్ నగర్ నుంచి పవిత్ర పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత ‘Way2News’తో తెలిపారు. ఈనెల ఉదయం 6:00 గంటలకు మహబూబ్ నగర్ నుంచి కొల్లాపూర్ సమీపంలోని పవిత్ర క్షేత్రాలు సోమశిల & సింగోటంకు బస్ వెళ్తుందని, తిరిగి సాయంత్రం 7:00 గంటలకు వస్తుందన్నారు. ఒక్కరికి ఛార్జీ: రూ.500. పూర్తి వివరాలకు 70136 46089, 93989 62021కు సంప్రదించాలని కోరారు.
News November 19, 2025
నూజివీడు: ఇన్ఫోసిస్లో ఉద్యోగాలు సాధించిన ట్రిపుల్ ఐటీ బాలికలు

నూజివీడు పట్టణ పరిధిలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలోని 66 మంది బాలికలు ఇన్ఫోసిస్లో ఉద్యోగావకాశాలను సాధించినట్లు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ..ఆర్జీయూకేటీ – ఏపీటీతో కలసి నిర్వహించిన నియామక డ్రైవ్లో బాలికలు ఉద్యోగాలు పొందినట్లు వివరించారు. వీరిలో 50 మంది సీఎస్ఈ, 9 మంది ఈసీఈ, ఏడుగురు ఈఈఈ విభాగాలకు చెందిన వారిగా తెలిపారు.
News November 19, 2025
బాలకృష్ణతో మరో సినిమా: అంబికా కృష్ణ

ఏలూరు: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తో ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మంగళవారం రాత్రి వైజాగ్లో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను అంబికా కృష్ణ సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ..బాలయ్యతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రేక్షకులు మెచ్చే కథ లభ్యమైతే బాలకృష్ణతో మరో చిత్రం నిర్మిస్తానన్నారు. ప్రస్తుతం కథల అన్వేషణలో ఉన్నామన్నారు.


