News February 6, 2025

ఈ నెల 10న కొడంగల్‌లో BRS రైతు దీక్ష

image

సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఈ నెల 10న బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. కోస్గిలో జరిగే ఈ దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష నిర్వహించనుంది.

Similar News

News March 11, 2026

శ్రీకాకుళం: కొనసాగుతున్న ఏసీబీ దాడులు

image

రాష్ట్ర వ్యాప్త దాడుల్లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం సైతం ఏసీబీ సీఐలు రమణ, భాస్కర్ రావుతో కూడిన బృందం పట్టణంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనుమతులు ఇచ్చిన భవనాలు, నిర్మాణ నిబంధనలు వంటివి పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

News March 11, 2026

వివేకా హత్య కేసు.. సునీత పిటిషన్ల కొట్టివేత

image

AP: దివంగత ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డికి చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణ త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును SC ఆదేశించింది.

News March 11, 2026

వరల్డ్ కప్ గెలిచాక ట్రైన్‌లో ముంబైకి వెళ్లిన దూబే

image

ప్రపంచ కప్ గెలిచామన్న సంతోషం ఓ వైపు. ఈ మధుర క్షణాలను పిల్లలతో పంచుకోవాలనే ఆరాటం మరో వైపు. అదే సమయంలో విమాన టికెట్స్ దొరక్కపోవడంతో టీమ్ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే తన భార్యతో కలిసి రైలులో థర్డ్ ఏసీ కోచ్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్, క్యాప్ ధరించి పై బెర్త్‌పై పడుకుని సొంతూరుకు చేరుకున్నారు.