News April 8, 2025
ఈ నెల 10-14 వరకు కామారెడ్డిలో 163 సెక్షన్: SP

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10-14 వరకు 163 (BNSS) సెక్షన్ అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లాలో సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన ఘటనలు జరగకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News December 20, 2025
కామారెడ్డి జిల్లాకు నూతన DCCB?

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లి., పర్సన్ ఇన్ఛార్జ్గా కలెక్టర్ను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం కలెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఉమ్మడి జిల్లాకు చెందిన DCCBని రెండు జిల్లాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో KMR జిల్లాలో నూతన DCCB ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
News December 20, 2025
ASF: పంచాయతీ పోరులో సగం.. సత్తా చాటిన మహిళలు

ASF జిల్లాలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడ్డారు. జిల్లాలో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్లు గెలుపొందారు. మొదటి విడతలో 60 మంది, 2వ విడతలో 54, 3వ విడతలో 56 మహిళలు ఎన్నికయ్యారు.
News December 20, 2025
కామారెడ్డి: లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలి

కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, బీడీ కార్మికులు, ఇతర కంపెనీల్లో పనిచేసి పదవి విరమణ పొంది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు ఈ నెలాఖరులోగా అందజేయాలని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయనివారు మీసేవా కేంద్రాల్లో అందజేయాలన్నారు.


