News April 12, 2025

ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు

image

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్  జయంతి ఉత్సవాలను ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వెనుకబడిన తరగతుల నాయకులు, కార్మికులు హాజరుకావాలని ఆమె కోరారు.

Similar News

News February 8, 2026

పాక్ ఏజెంట్‌తో గొగొయ్‌కి సంబంధాలు: CM

image

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్‌పై అస్సాం CM హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పాక్ ఏజెంట్ అలీ తౌఖీర్‌‌తో గౌరవ్ గొగొయ్‌, ఆయన భార్య ఎలిజబెత్‌(బ్రిటిష్ పౌరురాలు)కి సంబంధాలున్నాయి. 44పేజీల SIT నివేదిక ప్రకారం ఆమె కీలక సమాచారం పంచుకున్నట్లు ఉంది. పాక్‌కు చెందిన ఓ సంస్థ ఆమెకు జీతమిచ్చింది. గొగొయ్‌తో వివాహమయ్యాక ఆమె 9సార్లు పాక్ వెళ్లారు. గౌరవ్ కుటుంబంలో మరొకరు పాక్‌కు సహకరిస్తున్నారు’ అని ఆరోపించారు.

News February 8, 2026

మహిళల రక్షణకు శక్తి యాప్‌ను వినియోగించండి: VZM ఎస్పీ

image

మహిళల భద్రతకు ప్రభుత్వం రూపొందించిన శక్తి (SOS) మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ, విద్యార్థిని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా SP ఎ.ఆర్. దామోదర్ ఆదివారం పిలుపునిచ్చారు. ఆపద సమయంలో యాప్‌లోని SOS బటన్ నొక్కితే క్షణాల్లో పోలీసులు లొకేషన్‌కు చేరుకుంటారని ఆయన తెలిపారు. యాప్‌లో సేఫ్ ట్రావెల్, నైట్ షెల్టర్లు, పోలీస్ స్టేషన్ నంబర్లు, ఫిర్యాదు సౌకర్యం వంటి సేవలు ఉన్నాయని వెల్లడించారు.

News February 8, 2026

పార్వతీపురం: PGRS కార్యక్రమం రద్దు

image

పార్వతీపుం కలెక్టరేట్‌‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబుతో సమీక్ష కారణంగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి ఎవరు అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావద్దన్నారు.