News August 8, 2024
ఈ నెల 14న కాగ్నిజెంట్ విస్తరణకు ముహూర్తం

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తన విస్తరణ ప్రణాళికను ఆగస్టు 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రణాళిక ఉంటుందని కాగ్నిజెంట్ పేర్కొంది.
Similar News
News November 22, 2025
HYD: బీసీ కమిషన్ రిపోర్ట్‌కు కేబినెట్ ఆమోదం

తెలంగాణలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీ రాజ్ శాఖ నేడు జీవోను విడుదల చేయనుంది. జిల్లా కలెక్టర్లు నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి నివేదికను పంచాయతీ రాజ్ శాఖ నవంబర్ 24వ తేదీన కోర్టుకు సమర్పించనుంది. ఈ నిర్ణయం ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నారు.
News November 22, 2025
HYDలో అతి పెద్ద పౌల్ట్రీ ఎక్స్పో

దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ ‘పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్-2025’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 25 నుంచి హైటెక్స్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ ఎక్స్పో జరగనుంది. సుమారు 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40వేల మంది సందర్శకులు హాజరుకానున్నారు. సస్టెయినబుల్ ఫీడ్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చిస్తారు.
News November 22, 2025
HYD: పైలట్‌పై అత్యాచారయత్నం

అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు HYDలోని బేగంపేట PSలో ఫిర్యాదు చేసింది. ఓ ఏవియేషన్ సంస్థకు చెందిన కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ (60) సహోద్యోగి అయిన యువతిపై బెంగళూరులో అత్యాచారయత్నం చేశాడు. సంస్థ పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో హోటల్ గదిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన బెంగళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.


