News September 13, 2024
ఈ నెల 17 నుంచి ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకొని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు జరుగుతాయని, అక్టోబర్ 2న స్వచ్చ భారత్ దివాస్గా జరుపుకుంటామని తెలిపారు.
Similar News
News October 25, 2025
VZM: ఒకేచోట ఆధ్యాత్మికత.. పర్యాటకం

విజయనగరం మండలం సారిక గ్రామంలోని కాళీమాత దేవాలయం, రామబాణం ఆకారంలో ఉన్న రామనారాయణం దేవాలయం పక్కనే ఉండటంతో ఆధ్యాత్మిక సందర్శకుల కేంద్రంగా మారింది. కార్తీక మాసంలో భక్తులు ఒకేసారి రెండు పుణ్య క్షేత్రాలను దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తోంది. దీంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. భక్తులు కాళీమాత ఆశీస్సులు, శ్రీరామచంద్రుడి కృప ఒకే చోట పొందుతున్నారు.
News October 24, 2025
VZM: స్త్రీ నిధి ఋణం వాయిదాలపై అవగాహన వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్య కార్యక్రమాల్లో భాగంగా స్త్రీ నిధి ఋణం నెలవారీ చెల్లించాల్సిన వాయిదాల వివరాలను తెలియజేసే పోస్టర్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు తమ ఆర్థిక బాధ్యతలను సులభంగా నిర్వర్తించేందుకు అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
News October 24, 2025
వేతనదారులకు సగటు వేతనం పెంచేందుకు కృషి చేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ వేతనదారులకు సగటు వేతనం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు. అధికారులుతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఫారంపాండ్స్, చెక్డ్యామ్లు, పశు శాలలు, మ్యాజిక్ డ్రెయిన్స్, మొక్కల నాటే కార్యక్రమాలను నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలని, ఏపీడీలు, ఎంపీడీవోలు గ్రామస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.


