News September 17, 2024
ఈ నెల 19న విశాఖకు గవర్నర్ రాక

ఈనెల 19వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళతారు. సాయంత్రం ఏయూలో నిర్వహించే దివ్య కల మేళాలో ఆయన పాల్గొంటారు. తిరిగి నొవాటెల్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. 20వ తేదీ సాయంత్రం విమానంలో ఆయన విజయవాడ వెళతారు.
Similar News
News October 15, 2025
పెందుర్తిలో 6.8కేజీల గంజాయి పట్టివేత

విశాఖ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం నిర్వహించిన పెట్రోలింగ్‌లో పెందుర్తి రైల్వే స్టేషన్ వెలుపల అనుమానితులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ప్రకాశం జిల్లాకు చెందిన కువ్వరపు వినీల్ కుమార్, షేక్ సలీం అనే ఇద్దరు వ్యక్తులు రూ.40వేలు విలువ గల 6.8 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముద్దాయిలను పెందుర్తి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.
News October 14, 2025
విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.
News October 14, 2025
విశాఖ: ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

ముగ్గురు సైబర్ నేరగాళ్లను విశాఖ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలేనికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్ పేరిట మెసెజ్ చేశారు. వివిధ కంపెనీల పేరిట రూ.15.51 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. టెలిగ్రామ్ గ్రూపు IP లాగ్స్ ద్వారా నంద్యాలకి చెందిన షేక్ షరీఫ్ రెహమాన్, అబ్ధుల్ రెహమాన్, హుస్సేన్ వలిని పట్టుకున్నారు.