News January 18, 2025
ఈ నెల 21న నల్గొండకు కేటీఆర్

నల్గొండకు ఈ నెల 21 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాసభలో పాల్గొననున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ఓటమి తరువాత నల్గొండ టౌన్కు కేటీఆర్ రావడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల 13న నిర్వహించాల్సిన రైతు మహాసభ వివిధ కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
Similar News
News January 9, 2026
నార్కట్పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులో జనవరి 23 నుంచి 30 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
News January 9, 2026
‘చెరువుగట్టు’ అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్

చెరువుగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశామని, వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ నెల 23 నుంచి 30 వరకు నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు జరగనున్నందున శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల, TDDCF ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
News January 9, 2026
కల్తీ ఆహారం అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

ప్రజలకు సురక్షిత ఆహారం అందించేందుకు హోటళ్లు, దాబాలపై విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీల నుంచి ఆహార శాంపిళ్లు సేకరించి పరీక్షించాలని సూచించారు. కల్తీకి పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని, ప్రతి వ్యాపారి తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆయన పేర్కొన్నారు.


