News April 21, 2024
ఈ నెల 23 ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 23వ తేదీ ఉదయం నిర్వహించడానికి దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని 23వ తేదీ మంగళవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే ప్రదక్షిణలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగిస్తారు.
Similar News
News December 26, 2024
నేడే ఉమ్మడి కృష్ణాజిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక
పొన్నవరం గ్రామంలోని ఏకత్వా పాఠశాలలో గురువారం సాయంత్రం మూడు గంటలకు ఉమ్మడి కృష్ణాజిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి నాగం సతీష్ తెలిపారు. ఈ పోటీలకు 2008 జనవరి నుంచి 2011 డిసెంబరు మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News December 25, 2024
గుడ్లవల్లేరులో క్రికెట్ ఆడేందుకు వెళ్లి యువకుడి మృతి
గుడ్లవల్లేరు మండలం అంగళూరులో గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతుడి స్నేహితుల వివరాల మేరకు.. అంగళూరు గ్రామానికి చెందిన కొమ్మలపాటి సాయి (26) కౌతవరం గ్రామానికి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. సాయి బౌలింగ్ చేస్తూ హఠాత్తుగా కింద పడిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు గుడివాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News December 25, 2024
కోడూరు: విద్యుత్ షాక్‌తో పంచాయతీ స్వీపర్ మృతి
కోడూరు మండలం పిట్టల్లంకలో విద్యుత్ షాక్‌తో పంచాయతీ స్వీపర్ రంగారావు (54) మృతి చెందారు. ఎస్సై చాణిక్య వివరాల మేరకు.. పంచాయతీలో స్వీపర్‌గా పని చేస్తున్న రంగారావు బుధవారం వాటర్ ట్యాంక్ నిండడంతో స్విచ్ ఆపేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.