News February 19, 2026
ఈ నెల 28న తెలంగాణ బడ్జెట్

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 26న సమావేశాలు ప్రారంభం కానుండగా, 28వ తేదీన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15 రోజుల పాటు సభను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 17, 2026
డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DCP యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
News March 17, 2026
కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే!

సిలిండర్ బుకింగ్‌లో ఎలాంటి అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా బుక్ చేయాలనుకునే వారు 8391990070కు డయల్ చేయవచ్చు(IVRS). <<19379922>>ఓల్డ్ నంబర్స్<<>> కూడా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది. share it
News March 17, 2026
రంగంలోకి ‘డూమ్స్ డే’ విమానాలు.. వీటి ప్రత్యేకత ఇదే

USకు చెందిన శక్తిమంతమైన E-6B మెర్క్యూరీ(డూమ్స్ డే) విమానాలు పశ్చిమాసియాలో మరోసారి కనిపించడం కలకలం రేపింది. అణ్వాయుధ దాడి జరిగి భూమిపైన US సిగ్నలింగ్ వ్యవస్థ నాశనమైనప్పుడే వీటిని రంగంలోకి దించుతారు. 150 ఫీట్ల పొడవుండే ఈ విమానాలు 40వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలవు. ఆకాశంలోనే ఇంధనం నింపుకుంటూ 7K మైళ్లు ప్రయాణించగలవు. ప్రపంచవ్యాప్తంగా US దాచిన క్షిపణులను వీటి ద్వారా ప్రయోగించవచ్చు.


