News February 5, 2025

ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి

image

కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.

Similar News

News February 18, 2025

ఎస్.కోటలో రెండు బైకులు ఢీ.. బాలుడు మృతి

image

శృంగవరపుకోట టౌన్ పరిధిలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో 17ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. బద్దు మహేందర్ రెడ్డి తన బండిపై విశాఖ-అరకు హైవే దాటుతుండగా, బాడితబోయిన దుర్గాప్రసాద్(17) బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలతో బాలుడు మృతి చెందగా.. మహేంద్ర రెడ్డి విజయనగరంలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. 

News February 18, 2025

విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ MLC ఓటర్లు ఇలా..!

image

➤ మొత్తం ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య: 4,937 
➤ పురుష ఓటర్లు: 3,100 
➤ మహిళా ఓటర్లు:1,837 
➤ పోలింగ్ కేంద్రాల సంఖ్య: 29 
➤ పోలింగ్ తేదీ: 27.02.2025 
➤ ఓట్ల లెక్కింపు తేదీ: 03.03.2025

News February 18, 2025

జిల్లాలో హోటల్స్‌కు ప్రభుత్వం రేటింగ్: కలెక్టర్

image

పర్యావరణ హితంగా, పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్‌ను హోటల్స్ ఆన్‌లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చునని, అందువలన ఆయా హోటల్స్‌కు ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికీ తెలుస్తుందని పేర్కొన్నారు.

error: Content is protected !!