News July 7, 2024
ఈ నెల 8న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కర్నూలు కలెక్టర్

జులై 8వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం)కార్యక్రమం ద్వారా వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News February 12, 2025
‘ఎల్ఐసీ ఉద్యోగులకు పనిభారం తగ్గించండి’

LICలో 3, 4 తరగతుల శ్రేణిలో ఖాళీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పీఎస్ రవిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోని బ్రాంచ్ కార్యాలయం ముందు సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. LICలో కేవలం ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల్లోనే 3,130 మంది క్లాస్ 3, 4 తరగతుల శ్రేణి ఉద్యోగులు తగ్గారని అన్నారు. పాలసీదారులకు సేవలందించేందుకు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్నారు.
News February 11, 2025
కోరికల కొండ గురించి తెలుసా?

శ్రీశైలం పాదయాత్రలో పెద్ద చెరువు దాటిన తర్వాత కోరికల కొండ వస్తుంది. ఈ కొండ మీద మన కోరిక చెప్పుకుంటే తీరుతుందని భక్తుల నమ్మకం. పెళ్లి కావాలనుకునే వారు అక్కడ చిన్న పందిరి వేస్తారట. సంతానం కోరుకొనే వారు ఉయ్యాల కడతారు. సొంతిల్లు కావాలనుకునే వారు ఒక రాయి మీద ఇంకో రాయి పేరుస్తారు. కొంత మంది తమ కోరికలు ఆ కొండ మీద మట్టిలో చేతితో రాస్తారట. మరి మీరు శ్రీశైలానికి పాదయత్రగా వెళ్లారా?
News February 11, 2025
నేడు అహోబిలం రానున్న హీరో సాయిదుర్గ తేజ్

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయ దర్శనార్థం మంగళవారం ఉదయం 10 గంటలకు హీరో సాయిదుర్గ తేజ్ వస్తున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని అభిమానులు అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.