News February 18, 2025

ఈ ప్రాంతాల్లో భారీగా పడిపోయిన భూగర్భ జలాలు

image

గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని తెలిపిన భూగర్భజల శాఖ అధికారులు లిస్ట్ విడుదల చేశారు. ఎర్రగడ్డ, చంద్రాయణగుట్ట, మేడిపల్లి, హస్మత్‌పేట, యాప్రాల్, ఫతేనగర్, దూలపల్లి, శంభిపూర్, చెంగిచెర్ల, గుండ్ల పోచంపల్లి, మేడిపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఉప్పల్, పటాన్‌చెరు, రామంతపూర్, రామచంద్రపురం ప్రాంతంలోనూ 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.

Similar News

News October 15, 2025

JGTL: పేదల సంక్షేమం కోసం కృషి చేస్తా: MLC రమణ

image

పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని MLC రమణ పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో 15 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2,65,500 విలువగల చెక్కులను ఎమ్మెల్సీ రమణ లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో BRS నాయకులు గట్టు సతీష్, తేలు రాజు, అల్లాల ఆనంద్ రావు, బర్కాం మల్లేశం, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News October 15, 2025

పత్తి దిగుబడి పెరగాలంటే..

image

ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ తయారీ దశలో ఉంది. మూడు నెలలు పై బడిన పంటకు యూరియా, పొటాష్, కాంప్లెక్స్ వంటి ఎరువులను పైపాటుగా వేయరాదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ‘పంటపై 10గ్రా. 13:0:45(మల్టీ-కే) లేదా 19:19:19(పాలిఫీడ్) లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి. లేదా 20గ్రా. యూరియాను 10-15రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే కాయ ఎదుగుదల బాగుంటుంది. అధిక దిగుబడి సాధ్యమవుతుంది’ అని పేర్కొంటున్నారు.

News October 15, 2025

శ్రీరాంపూర్: 20న సింగరేణి ఉద్యోగులకు దీపావళి సెలవు దినం

image

సింగరేణి ఉద్యోగులకు ఈనెల 20న దీపావళి పండుగ సందర్భంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులకు సెలవు రోజున సాధారణ వేతనంతో పాటు మూడింతలు అధికంగా వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.