News February 14, 2026
ఈ ఫలితాలు ప్రజల విశ్వాసాన్ని చాటాయి: ఖర్గే

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీపై ప్రజల విశ్వాసాన్ని చాటాయని పేర్కొన్నారు. 3.8 కోట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత, నిరంతర పురోగతి అందిస్తూ ‘ప్రజా తెలంగాణ’కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.
Similar News
News March 13, 2026
స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్.. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ!

పురుషుల్లో ఫెర్టిలిటీపై అవగాహనకు ఓ US స్టార్టప్ వినూత్నంగా స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్ నిర్వహిస్తోంది. విజేతలకు $1,00,000 (₹92.33L) ప్రైజ్ మనీ ఇస్తారు. హెల్త్, శాంపిల్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మైక్రోస్కోప్‌లో వీర్యకణాలకు క్వాలిఫయింగ్ రేస్, హెడ్ టు హెడ్, ఫైనల్ నిర్వహిస్తారు. 2025లో USలో $10,000 క్యాష్ ప్రైజ్‌తో నిర్వహించిన రేస్ సక్సెస్ కావడంతో ఈసారి 128 దేశాల అథ్లెట్లతో టోర్నీ జరపనుంది.
News March 13, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in
News March 13, 2026
ఏపీ క్యాబినెట్ సమావేశం.. 27 అంశాలకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. 27 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అనారోగ్యం కారణంగా ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎండీ ఫరూక్ హాజరుకాలేదు.


