News January 19, 2025

ఈ-మొబిలిటీ పార్క్: YCP ప్రధాన ఆరోపణలివే..

image

– ఈ-బైక్స్ తయారీలో పీపుల్ టెక్‌కు అనుభవం లేదు
– బైక్స్ తయారీ కోసం భాగస్వామ్య కంపెనీని ఎంచుకోలేదని చెబుతూనే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది
– రూ.2100 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయి ఆ సంస్థకు లేదు
– పీపుల్ టెక్ సంస్థ పవన్ స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్‌ది కావడం వల్లే ఎకరా రూ.కోటికి పైగా పలికే భూమిని రూ.15 లక్షల చొప్పున 1200 ఎకరాలు <<15197150>>అప్పగించే ప్రయత్నం<<>>
– భూముల దోపిడీకే ఓర్వకల్లు కారిడార్‌కు క్యాబినెట్ ఆమోదం

Similar News

News January 5, 2026

బంగ్లాదేశ్ ఎన్నికలపై భారత్ కలవరపాటు!

image

బంగ్లాదేశ్‌లో మార్చిలో జరిగే ఎన్నికలు భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, తాత్కాలిక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణాలుగా ఉన్నాయి. నిషేధిత అవామీ లీగ్‌ను జాతీయ పార్టీ BNP, జమాత్‌తో పాటుగా ఎన్నికల పోటీకి అనుమతించాలనే భారత్ కోరుకుంటోంది. స్వేచ్ఛ లేకుండా ఎన్నికలు జరిగితే మైనారిటీలపై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది.

News January 5, 2026

మహ్మద్ సిరాజ్ అన్‌లక్కీ: డివిలియర్స్

image

మహ్మద్ సిరాజ్ కెరీర్‌పై SA మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. ‘సిరాజ్ తిరిగి ODI జట్టులోకి రాగలిగాడు. కానీ అతను అన్‌లక్కీ. T20 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు. సెలక్టర్స్ టీమ్ బ్యాలన్స్‌పైనే ఫోకస్ చేశారు. సీమర్స్‌పై ఆధారపడకుండా స్పిన్నర్లకు ప్రాధాన్యమిచ్చారు. బుమ్రా, అర్ష్‌దీప్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ చేయగలడని హర్షిత్ రాణాకు కూడా అవకాశమిచ్చారు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.

News January 5, 2026

రాష్ట్రంలో 220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>ఏపీ<<>> మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 8 నుంచి 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD/MS/DNB/DM/MCH/DrNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dme.ap.nic.in