News August 4, 2024
ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ తొలగించబడింది
నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12787, 12788 ట్రైన్‌లను ఆగస్టు 3 -10 వరకు విజయవాడ మీదుగా కాక రామవరప్పాడు- రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ లేదని, సమీపంలోని రామవరప్పాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామన్నారు.
Similar News
News November 26, 2024
30కి కృష్ణా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా
కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేపథ్యంలో ఈనెల 27వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని 30వ తేదీకి మార్చారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక ఓ ప్రకటన విడుదల చేశారు. 30న జరిగే సమావేశానికి సభ్యులంతా విధిగా హాజరు కావాలని కోరారు.
News November 26, 2024
కృష్ణా: కాదంబరి కేసు వాయిదా
ముంబై నటి కాదంబరి కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పలువురు IPS ఆఫీసర్లు, పోలీసులు, లాయర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగ్గా.. కేసు విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది. కౌంటర్ వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో కేసు విచారణ వాయిదా పడింది.
News November 26, 2024
మచిలీపట్నంలో అసలేం జరిగిందంటే?
మచిలీపట్నంలో దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించగా భార్య <<14701508>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. నిజాంపేటకు చెందిన గోపీకృష్ణ, కావ్య(32)కు ఇద్దరు పిల్లలు. ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య గొడవ జరగ్గా.. ఆత్మహత్య చేసుకుంటానని భర్త చెప్పారు. ‘నేనూ సూసైడ్ చేసుకుంటా’ అని భార్య చెప్పడంతో ఇద్దరూ బైకుపై బుద్దాలపాలేనికి వచ్చారు. ఇద్దరూ రైలుకు ఎదురెళ్లగా కావ్య చనిపోయింది. చివరి నిమిషంలో గోపీకృష్ణ తప్పుకోవడంతో ఆయనకు గాయాలయ్యాయి.