News November 10, 2024
ఈ స్వామికి నిత్యం దీపదూప నైవేద్యాలు
మోపిదేవి మండలం కొత్తపాలెంలో కృష్ణానది ఒడ్డున ఉన్న దుర్గాకోటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో స్వామివారికి నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు ఈ స్వామికి మొక్కులు తీర్చుకుంటే సంతానం కలుగుతుందని, కార్తిక మాసంలో ఇక్కడి నదిలో స్నానమాచరించి దీపాలు వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర చేస్తారు. ఇక్కడే మరిన్ని ఆలయాలున్నాయి.
Similar News
News December 11, 2024
VJA: ప్రయాణికులను మోసం చేస్తున్న నలుగురు అరెస్ట్
ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసులు వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ సురేష్, తారకేశ్వరరావు, కంబల శ్రీను, రాజు అనే వ్యక్తులు బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులను మోసం చేస్తూ ఉంటారన్నారు. ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి వీరిని పట్టుకున్నామని చెప్పారు. వారి నుంచి రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.
News December 11, 2024
కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB) – హౌరా(HWH)(నం.06585) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 10.15 గంటలకు SMVBలో బయలుదేరే ఈ ట్రైన్ అదే రోజు రాత్రి 10.10 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 15వ తేదీన రాత్రి 9.45 గంటలకు HWH చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.
News December 11, 2024
కృష్ణా: పీజీ (రెగ్యులర్ )పరీక్షల ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పీజీ కోర్సు 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.